అల్లూరి : మన్యంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో పొగమంచు దట్టంగా కురుస్తోంది. పాడేరు నుంచి ముంచంగిపుట్టు వరకు రహదారిలో దట్టంగా పొగ మంచు అలముకుంది. చింతపలిలో బుధవారం ఉదయం 19.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు.