VZM: జామి మండలంలోని భీమసింగి జంక్షన్లో కనకదుర్గ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం దుర్గాదేవి ఆలయంలో పందిరాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీను సిద్ధాంతి మాట్లాడుతూ.. అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు ఉంటాయని తెలిపారు. అనంతరం అమ్మవారికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు, కుంకుమ పూజ,అన్నసంతర్పణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.