SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ రెండో వార్డ్ కృష్ణాపురం మెయిన్ రోడ్డు పక్కన చెత్త కుప్పలు పేరుకు పోవడంతో గ్రామస్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. వర్షం పడితే దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందని మండిపడుతున్నారు.