SKLM: పోలాకి మండలం కింజ రాపువానిపేట గ్రామంలో రూ. 29.30 లక్షల ప్రాథమిక పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే రమణమూర్తి హాజరై కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.