గుంటూరు: తెనాలి పట్టణంలోని తాగునీటి సరఫరా హెడ్ వాటర్ వర్క్స్ కేంద్రంలోని మోటార్ల మరమ్మతుల నేపథ్యంలో సోమవారం త్రాగునీరు సరఫరాలో అంతరాయం కలగనుందని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని చంద్రబాబునాయుడు కాలనీ, పినపాడు, అమరావతి కాలనీలోని కుళాయిలకు సరఫరా ఉండదన్నారు. సాయంత్రానికి సరఫరాను పునరుద్ధరించనున్నట్లు ఆయన వివరించారు.