సత్యసాయి: పుట్టపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక జిల్లా ఎస్పీ వి.రత్న ఆధ్వర్యంలో సంబంధిత అధికారులతో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి 76 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు సకాలంలో అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలని ఎస్పీ తెలిపారు.