W G: ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ఈనెల 26వ తేదీ లోపు మండల వ్యాప్తంగా పూర్తి చేయాలని పెదవేగి ఇంఛార్జ్ ఎంపీడీవో పి. శ్రీనివాస్ తెలిపారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో సచివాలయ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. గడపగడపకూ వెళ్లి స్టిక్కర్లు అందించడంతో పాటు ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని అన్నారు.