కాకినాడ: పాఠశాల క్రీడా సమాఖ్య అండర్-14, 17 జిల్లా శాఖ ఆధర్యంలో ఈనెల 25 నుంచి జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పి.రమేష్, ఎస్ఎఫ్ఐ కార్యదర్శి ఎల్.జార్జి సోమవారం సాయంత్రం తెలిపారు. కాకినాడలోని జిల్లా క్రీడా మైదానంలో ఉదయం 8 గంటలకు ఎంపికలు ప్రారంభమవుతాయన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు హాజరుకావాలని సూచించారు.