KRNL: ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయం కింద ఇస్తామన్న రూ.20 వేలు ఇప్పటివరకు ఇవ్వకపోవడం శోచనీయమని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కర్నూలులోని కార్మిక, కర్షక భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఖరీఫ్, రబీ సీజన్లో నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.