»Lady Super Star Sai Pallavi Character In Jr Ntr 30 Movie Rumors Goes To Viral
NTR Movie నిజమేనా.. ‘ఎన్టీఆర్ 30’లో లేడీ పవర్ స్టార్!?
కానీ ఇప్పుడు ఊహించని హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ఆమె ఇంకెవరో కాదు.. లేడీ పవర్ స్టార్. ఇప్పుడే కాదు.. గతంలోను ఆమె స్టార్ హీరోల సరసన రొమాన్స్ చేయబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ ఫిల్మ్ 'పుష్ప2'లో అయితే.. ఆమె ఏకంగా షూటింగ్లో కూడా జాయిన్ అయిందనే పుకార్లు వచ్చాయి.
ట్రిపుల్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) నటిస్తున్న30వ చిత్రం.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ (Shooting) జరుపుకుంటోంది. ఆచార్య తర్వాత డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో (Ramoji Film City) విలన్ సైఫ్ అలీఖాన్, హీరో ఎన్టీఆర్ మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో సెకండ్ హీరోయిన్గా లేడీ పవర్ స్టార్ ఫిక్స్ అయిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఎన్టీఆర్ 30లో(NTR 30) బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనే అమ్మడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. అయితే జాన్వీతో పాటు మరో హీరోయిన్‌కు కూడా ఈ సినిమాలో స్కోప్ ఉందట. అందుకోసం ఇప్పటికే పలువురు ముద్దుగుమ్మల పేర్లు వినిపించాయి. క్యూట్ బ్యూటీ కృతిశెట్టి పేరు కూడా వినిపించింది. కానీ ఇప్పుడు ఊహించని హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ఆమె ఇంకెవరో కాదు.. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi). ఇప్పుడే కాదు.. గతంలోను ఆమె స్టార్ హీరోల సరసన రొమాన్స్ చేయబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ ఫిల్మ్ ‘పుష్ప2’లో అయితే.. సాయి పల్లవి ఏకంగా షూటింగ్లో కూడా జాయిన్ అయిందనే పుకార్లు వచ్చాయి. ఇక ఇప్పుడేమో ఎన్టీఆర్ 30లో సాయి పల్లవి నటిస్తుందనే టాక్ ఊపందుకుంది. అసలు ఎన్టీఆర్ 30లో ప్రధాన హీరోయిన్గా సాయి పల్లవి ఫిక్స్ అయిందని గతంలో అన్నారు. అలాంటిది ఇప్పుడు సెకండ్ లీడ్ అంటున్నారు. కాబట్టి ఇది కూడా జస్ట్ రూమర్ అనే అనుకోవచ్చు. కానీ సినిమా అన్నప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అందుకే ఎన్టీఆర్ 30లో సాయి పల్లవి నటించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే.. ఎన్టీఆర్ 30 పై మరింత వెయిట్ పెరిగినట్టే. మరి ఎన్టీఆర్ 30 టీమ్ దీనిపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.