kushboo:సినీ నటి ఖుష్బు (kushboo) సెన్సేషన్ కామెంట్స్ చేశారు. ఇటీవలే ఆమె మహిళా కమిషన్ సభ్యురాలు అయిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) సహా పలువురు ఆమెను విష్ చేశారు. ఇంతలోనే తనకు చిన్నతనంలోనే జరిగిన అనుభవాలను పంచుకున్నారు.
kushboo:సినీ నటి ఖుష్బు (kushboo) సెన్సేషన్ కామెంట్స్ చేశారు. ఇటీవలే ఆమె మహిళా కమిషన్ సభ్యురాలు అయిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) సహా పలువురు ఆమెను విష్ చేశారు. ఇంతలోనే తనకు చిన్నతనంలోనే జరిగిన అనుభవాలను పంచుకున్నారు. ఎల్లుండి (8వ తేదీన) ప్రపంచ మహిళా దినోత్సవం (world womens day) అనే సంగతి తెలిసిందే. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఖుష్బు (kushboo) సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన చిన్నతనంలో తండ్రి లైంగిక వేధింపులకు గురిచేశాడని హాట్ కామెంట్స్ చేశారు. గాయపరిచి, చిత్రహింసలకు పెట్టాడని చెప్పారు. చిన్నతనంలో వేధింపులకు గురయితే.. అది వాళ్లను జీవితాంతం భయానికి గురిచేస్తుందని పేర్కొన్నారు. భార్య పిల్లలను చిత్రహింసలు పెట్టడం.. కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని వివరించారు. ఆయనతో తన తల్లి కూడా ఇబ్బందులు పడిందని తెలిపారు.
8 (8 years old) ఏళ్ల వయస్సులో లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని ఖుష్బు తెలిపారు. ఈ విషయం చెబితే అమ్మ నమ్ముతుందో లేదోనని భయపడ్డానని వివరించారు. ఏం జరిగినా తన భర్త దేవుడు అని నమ్మేవారని పేర్కొన్నారు. కానీ తాను మాత్రం 15 ఏళ్ల (15 years old) వయస్సులో ఎదురుతిరగడం ప్రారంభించానని వివరించారు. 16 ఏళ్ల రాకముందే ఆయన మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడని పేర్కొన్నారు. ఆ సమయంలో తాము ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నామని చెప్పారు.