Citadel హిందీ రీమేక్ కాదు.. ప్రీక్వెల్, ప్రియాంక తల్లిగా సమంత
సిటాడెల్ హిందీ వెబ్ సిరీస్ ఇంగ్లీష్‌కు రీమెక్ కాదు.. ప్రీక్వెల్. సిటాడెల్ ఇంగ్లీష్ సిరీస్ ప్రియాంక తండ్రి పాత్రకు వరుణ్ ధావన్ డబ్బింగ్ చెప్పడంతో ప్రీక్వెల్ అని ఖరారు అయ్యింది.
Citadel: సిటాడెల్ (Citadel).. ఇంగ్లీష్ వెబ్ సిరీస్, ఇందులో ప్రియాంక చోప్రా (priyanka chopra) ముఖ్య పాత్రలో నటించారు. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుండగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. వారానికో ఎపిసోడ్ రిలీజ్ చేయగా.. ఇప్పటివరకు 6 ఎపిసోడ్స్ వచ్చాయి. సిటాడెల్ హిందీ వెర్షన్ (Citadel) కూడా స్ట్రీమింగ్ రెడీ అవుతోంది. దీనికి సంబంధించి ఓ న్యూస్ బయటకు వచ్చింది.
హిందీ వెర్షన్లో సమంత (samantha), వరుణ్ ధావన్ (varun) కలిసి నటిస్తున్నారు. రాజ్ అండ్ డీ డైరెక్ట్ చేస్తున్నారు. హిందీ వెబ్ సిరీస్ షూటింగ్ దాదాపు కంప్లీట్ కావచ్చింది. సిటాడెల్ (Citadel) ఇంగ్లీష్ వెర్షన్ 5వ ఎపిసోడ్లో ప్రియాంక చోప్రా తండ్రి పాత్ర డబ్బింగ్ జరిగింది. ఆ పాత్రకు వరుణ్ దావన్ చెప్పారు. దీంతో ప్రియాంక తండ్రి వరుణ్ దావన్ (varun) అని తెలిసింది. అంటే సమంత (samantha) తల్లి అవుతుంది. సమంత కూతురు రోల్లో ప్రియాంక చోప్రా (priyanka) నటించారు. ఇప్పటివరకు సిటాడెల్ ఇంగ్లీష్‌లో రాగా హిందీ రీమేక్ అనుకున్నారు. కానీ ఇంగ్లీష్ సిటాడెల్కు ప్రీక్వెల్‌గా హిందీ సిటాడెల్ వస్తోంది.
హిందీ సిటాడెల్ (Citadel) 1990 కాలం నేపథ్యంలో సాగుతోందని తెలిసింది. ఇంగ్లీష్‌లో ఆరు ఎపిసోడ్లు రాగా.. హిందీలో కూడా ఉగ్రవాద ఛాయలతో సిరీస్ నిర్మాణం జరగనుంది. ఆ పరిస్థితులకు అనుగుణంగా తెరకెక్కిస్తారు. ఒకేసారి ఇంగ్లీష్ (english), హిందీ (hindi) వెబ్ సిరీస్ స్ట్రీమ్ కానున్నాయి. వినడానికి కాస్త ఆశ్చర్యంగా.. వింతగా ఉన్నప్పటికీ చూస్తే మాత్రం క్లారిటీ రానుంది. సో.. హిందీ సిటాడెల్ అనేది ప్రీక్వెల్.. ముందు జరిగిన కథ అని దీంతో స్పష్టమైంది.