పెళ్లిరోజు సందర్భంగా యాంకర్ అనసూయ (Anasuya) తన భర్త పై ఉన్న ప్రేమను పంచుకుంది. అయితే ఆ వీడియోలో తన భర్తకు ఒక పన్ను లేనట్లు కనిపించింది. దీంతో నెటిజన్స్ (Netizens) ఈసారి ఆయనను టార్గెట్ చేశారు. ఇంత ఆస్తి ఉంది ఒక్క పన్ను పెట్టించుకోవచ్చు కదా అంటూ కామెంట్ చేశారు.ఇక మరో నెటిజన్. బర్రెకి బంగారం దొరికినట్టు ఉంది అంటూ దారుణంగా ట్రోల్ చేశారు. దీంతో అనసూయ ఫ్యాన్స్ (fans) వెంటనే వారిపై ఫైర్ అవుతూ కనిపించారు.వారి లైఫ్ వాళ్ళ ఇష్టం.వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు. వాళ్లకు లేని బాధ మీకు ఎందుకు అంటూ తిరిగి కౌంటర్లు వేస్తున్నారు.
చేతినిండ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న యాంకర్ అనసూయ భర్త కూడా నెటిజన్ల నుంచి దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు. అయితే నేడు తమ పెళ్ళి రోజు (wedding day) సందర్భంగా తన భర్తపై ఉన్న ప్రేమను వీడియో (Video) రూపంలో నెట్టింట షేర్ చేసింది. ఇందులో వారిద్దరూ బాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు. వివాహ వార్షికోత్సవం కావడంతో ఓ షాకింగ్ పోస్ట్ (Shocking post)పెట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.“ప్రియమైన నిక్కూ.. ఇన్నాళ్లూ నాతో కలిసి ఉండటమే కాకుండా, ఎన్నో త్యాగాలు చేశారు. కొందరు మీపై ఎంతో నీచమైన కామెంట్స్ చేశారు. కానీ, మీరు వాటిని పట్టించుకోలేదు. మన ప్రేమ మందిరాన్ని ఎంతో అద్భుతంగా నిలబెట్టావు. అందుకు నీకు కృతజ్ఞతలు అని అనసూయ ట్వీట్ చేశారు