Samantha: సమంత షాకింగ్ పోస్ట్.. వైరల్ చేస్తున్న RCB ఫ్యాన్స్!
ప్రస్తుతం స్టార్ బ్యూటీ సమంత చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆమె ఎవరి కోసం, ఎందుకోసం ఆ పోస్ట్ చేసిందో తెలియదు గానీ, ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం ఆ పోస్ట్‌ను తెగ వైరల్ చేస్తున్నారు. ఇంతకీ సమంత చేసిన పోస్ట్ ఏంటి?
Samantha's shocking post.. RCB fans making it viral!
Samantha: ప్రస్తుతం సమంత ఖాళీగానే ఉంది. ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. కానీ రీసెంట్‌గానే బంగారం అనే లేడీ ఓరియెంటేడ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కానుంది. మరోవైపు సిటాడెల్ వెబ్ సిరీస్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రస్తుతానికైతే.. సోషల్ మీడియా, వెకేషన్తోనే టైంపాస్ చేస్తోంది అమ్మడు. లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ, అభిమానులతో చిట్ చాట్ చేస్తు.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అయితే.. లేటెస్ట్గా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా సామ్ పెట్టిన ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. నువ్వు గెలవడం నేను చూడాలనుకుంటున్నాను.. అంటూ ఓ పోస్ట్ పెట్టింది సమంత. నీ హృదయం ఏది కోరుకున్నా, మీరు ఎలాంటి ఆకాంక్షలు కలిగి ఉన్నా, నేను మీ కోసం ప్రార్థన చేస్తున్నాను. మీరు విజయానికి అర్హులు. అంటూ సమంత రాసుకొచ్చింది.
అసలు సామ్ ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టిందో తెలియదు కానీ, ఈరోజు జరగనున్న రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు ఐపీఎల్ మ్యాచ్ కోసమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సామ్ బెంగళూరు జట్టును ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టిందని ఆర్సీబి ఫ్యాన్స్ ఆమెకు థ్యాంక్స్ చెబుతూ ఆ పోస్ట్‌ని ఓ రేంజ్లో వైరల్ చేస్తున్నారు. ఈ సాలా కప్ నమ్దే అంటూ కామెంట్ చేస్తున్నారు. వాస్తవానికైతే.. ఈ ఐపీఎల్ సీజన్లో ఎవరూ ఊహించని విధంగా ఆర్సీబీ జట్టు ప్లే ఆఫ్స్‌కి చేరుకుంది. దీంతో సమంత ఆర్సీబికే సపోర్ట్ చేస్తుందని.. అందుకే ఈ పోస్ట్ చేసిందని అంటున్నారు. కానీ ఈ పోస్ట్‌కి క్రికెట్‌కి సంబంధం లేదని కొందరు అంటున్నారు. ఏదేమైనా.. సామ్ ఎందుకీ పోస్ట్ చేసిందో తెలియదు గానీ, ఆర్సీబీ ఫ్యాన్స్‌కు మాత్రం యమా కిక్ ఇస్తోంది.