మెల్లమెల్లగా సినిమా హీరోలు, హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇటీవల శర్వానంద్, నాగశౌర్య మ్యారేజ్ చేసుకోగా..తాజాగా ఇదే జాబితాలోకి కియరా అద్వాణీ, నేనింతే హీరోయిన్ అదితి గౌతమ్ కూడా చేరింది. కియరా అద్వాణీ బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లిచేసుకుంది. వీరి వివాహం రాజస్థాన్ జైసల్మేర్లో జరిగింది.
కాగా అదితి గౌతమ్ ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిన మిఖాయిల్ పాల్కివాలాతో ఏడడుగులు వేసింది. ఈ విషయాన్ని తానే స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు సహా అందరూ తమను ఆశీర్వదించాలని కోరింది. మోడల్ అయిన అదితి నేనింతే మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత కన్నడ డబుల్ డెక్కర్ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది.