Manchu Family : రోడ్డున పడ్డ మంచు ఫ్యామిలీ ఇంటి గుట్టు ..
Manchu Family : ఒకే ఒక్క చిన్న వీడియో మంచు ఫ్యామిలీ ఇంటి గుట్టుని రోడ్డున పడేసింది. వాస్తవానికి మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి.. మంచు బ్రదర్స్ మధ్య వార్ నడుస్తోందనే ప్రచారం ఊపందుకుంది.
ఒకే ఒక్క చిన్న వీడియో మంచు ఫ్యామిలీ ఇంటి గుట్టుని రోడ్డున పడేసింది. వాస్తవానికి మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి.. మంచు బ్రదర్స్ మధ్య వార్ నడుస్తోందనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఇప్పుడు ఏకంగా విష్ణు తన వాళ్లపై దాడి చేసినట్టు.. స్వయంగా మనోజ్ ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. అందరినీ ఆశ్చర్యపరిచింది. నాలుగు గోడల మధ్య సెటిల్ అవాల్సిన వ్యవహారం.. ఇప్పుడు నలుగురిలో పడిపోయింది. ప్రస్తుతం ఈ అన్నదమ్ములకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఇదిగో.. ఇలా ఇళ్లల్లోకి వచ్చి మా వాళ్లను, బంధువులను ఇలా కొడుతుంటారండి.. ఇది ఇక్కడి పరిస్థితి’ అంటూ మంచు మనోజ్ ఓ వీడియో పోస్ట్ చేశాడు. అందులో మంచు విష్ణు కోపంతో ఊగిపోతున్నాడు. ‘వాడు ఏదో అన్నాడు కదా.. ఒరేయ్ గిరేయ్..’ అంటూ ఎవరి మీదనో కేకలు వేస్తూ కనిపించాడు. అసలు అక్కడ ఏం జరిగింది.. అన్నదమ్ములు ఎందుకు గొడవ పడ్డారు.. అనే విషయాలు ఖచ్చితంగా తెలియకపోయినా.. ఈ మ్యాటర్ మాత్రం ఇండస్ట్రీ వర్గాలతో పాటు.. రాజకీయంగాను హాట్ టాపిక్‌గా మారింది. ఆస్తి తగాదాలే ఇందుకు కారణమనే చర్చ జరుగుతోంది. అలాగే రాజకీయ కోణంలోను దీన్ని పెద్దదిగా చూస్తున్నారు. మంచు విష్ణు భార్య వెరోనికా ఫ్యామిలీది వైకాపా అనే సంగతి తెలిసిందే. అయితే మంచు మనోజ్ ఇటీవలె భూమా నాగిరెడ్డి చిన్నకూతురు భూమా మౌనికను పెళ్లి చేసుకున్నాడు. వీళ్లది టీడిపీ ఫ్యామిలీ. ఈ పెళ్లి విష్ణుకి ఇష్టం లేదని టాక్ ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో మంచు బ్రదర్స్ మధ్య గొడవ జరగడం.. రాజకీయంగాను వేడెక్కింది. మరి మంచు బ్రదర్స్.. వీటికి ఎలా చెక్ పెడతారో చూడాలి.