Agent Movie : అయ్యే పాపం.. ఆ నిర్మాత పరిస్థితి ఏంటో?
ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో సినిమాకు హిట్ టాక్ వస్తే ఓకే.. లేదంటే బక్సాఫీస్ లెక్కే కాదు.. హీరోల డ్యామేజ్ కూడా ఘోరంగా ఉంటుంది. అది ప్రభాస్ సినిమానా.. అఖిల్ సినిమానా.. అని కాదు. సినిమా బాగుందా? లేదా? అనేదే ఆడియెన్స్‌కి కావాలి. సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. మేకర్స్ ప్రమోషన్స్‌తో బ్లాక్ బస్టర్ చేసే ఛాన్స్ ఉంటది. అదే నెగెటివ్ టాక్ వస్తే మాత్రం చేతులెత్తేయాల్సిందే. ప్రస్తుతం అఖిల్ పరిస్థితి అలాగే ఉంది.
సమ్మర్ సీజన్లో భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 28న గ్రాండ్‌గా రిలీజ్ అయింది ఏజెంట్ సినిమా(Agent Movie). కానీ ఫస్ట్ షో నుంచే ఏజెంట్ మిషన్ ఫెయిల్ అయిపోయింది. రోజు రోజుకి ఈ సినిమాకు దారుణమైన వసూళ్లు వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో కేవలం 6 కోట్లకు పైగా షేర్.. 11 కోట్లకు గ్రాస్ వసూళ్లను రాబటినట్టు తెలుస్తోంది. దాంతో ఇప్పట్లో ఏజెంట్(Agent) కోలుకునే పరిస్థితి లేదని చెప్పొచ్చు. ఈ సినిమాను ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర (Anil Sunkara) భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అస్సలు అఖిల్ (Akhil) మార్కెట్‌ను ఏ మాత్రం పట్టించుకోకుండా.. సురేందర్ రెడ్డి (Surendar Reddy) ఉన్న నమ్మకంతో దాదాపు 80 కోట్ల బడ్జెట్‌తో ఏజెంట్‌ను నిర్మించారు. కానీ ఇప్పుడు ఏజెంట్ పరిస్థితి దారుణాతి దారుణంగా ఉంది.
37 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో బరిలోకి దిగిన ఏజెంట్(Agent Movie).. కనీసం పది కోట్లు కూడా రాబట్టే ఛాన్సెస్ లేవు. దాంతో అనిల్ సుంకరకు ఇది కోలుకోలేని ఎదురు దెబ్బేనని చెప్పొచ్చు. ఏజెంట్ నాన్ థియేట్రికల్ రైట్స్.. అంటే డిజిటల్, శాటిలైర్ రైట్స్ కలుపుకున్నా.. అనిల్ (Anil Sunkara)కు భారీ నష్టం తప్పేలా లేదంటున్నారు. ఎంతో ప్యాషన్‌తో సినిమాలను నిర్మిస్తున్న అనిల్ సుంకర.. యుఎస్‌లో వ్యాపారం చేస్తూ.. డిస్ట్రిబ్యూషన్లోకి అడుగు పెట్టి, ఆ తర్వాత 14 రీల్స్ అధినేతలతో కలిసి సినిమాలు నిర్మించాడు. ఆ తర్వాత ఏకే ఎంటర్టైన్మెంట్స్ అంటూ.. సొంత బ్యానర్ పై సినిమాలు చేస్తున్నారు. అలాంటి ప్రొడ్యూసర్‌ను ఏజెంట్ సినిమా.. నట్టేట ముంచేసిందనే చెప్పాలి.