Power Star : ఒక పక్క రాజకీయాలు చేస్తూనే.. మరోపక్క వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వినోదయ సీతం' షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి.. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై దృష్టి సారించనున్నారు పవన్.
ఒక పక్క రాజకీయాలు చేస్తూనే.. మరోపక్క వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వినోదయ సీతం’ షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి.. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై దృష్టి సారించనున్నారు పవన్. ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఆ వెంటనే సుజీత్ దర్శకత్వంలో ఓజి ప్రాజెక్ట్ మొదలు పెట్టబోతున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ సాలిడ్ అప్టేడ్.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తోంది. ఓజి అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టార్.. అందుకు తగ్గట్టే ఈ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతోంది. ఈ సినిమా పూర్తిస్థాయిగా ముంబై బ్యాగ్రౌండ్లో పవర్ ఫుల్ గ్యాంగ్ స్టార్ డ్రామాగా తెరకెక్కబోతోందట. అలాగే కొంత భాగం జపాన్‌లో కూడా షూట్ చేయబోతున్నారట. మేజర్ పార్ట్ ముంబై, జపాన్‌లోనే ప్లాన్ చేస్తున్నారట. దాంతో.. పక్కా ఈ సినిమా ఒరిజినల్ గ్యాంగ్ స్టర్‌గా రాబోతోందని చెప్పొచ్చు. అంతుకు ముందు ప్రభాస్‌తో సుజీత్ చేసిన ‘సాహో’ మూవీ.. అనుకున్నంత స్థాయిలో అలరించలేకపోయింది. అందుకే పవర్ స్టార్ కోసం పవర్ ఫుల్ స్క్రిప్టు రెడీ చేశాడట సుజీత్. ఎట్టి పరిస్థితుల్లోను పవన్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని చూస్తున్నాడట. ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు తర్వాత ఓజి పైనే భారీ ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. ఎందుకంటే.. వినోదయ సీతం, ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్‌గా తెరకెక్కుతున్నాయి. అయినా ఇప్పటి వరకు హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ అవడం లేదు. కానీ మిగతా సినిమాలను పరుగులు పెట్టిస్తున్నారు పవన్.