Prabhas : ప్రస్తుతం ప్రభాస్ పలు భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. ఒక సినిమా షూటింగ్ అయిపోగానే, మరో సినిమా షూటింగ్లో పాల్గొంటూ.. గ్యాప్ లేకుండా ఫుల్ బిజీగా ఉన్నాడు. సలార్, ప్రాజెక్ట్ కె, మారుతి సినిమాలను నాన్‌స్టాప్‌గా కొట్టేస్తున్నాడు. కానీ ఈ మధ్య ప్రభాస్ అనారోగ్యంతో బాధపడుతున్నాడనే న్యూస్ ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతోంది.
ప్రస్తుతం ప్రభాస్ పలు భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. ఒక సినిమా షూటింగ్ అయిపోగానే, మరో సినిమా షూటింగ్లో పాల్గొంటూ.. గ్యాప్ లేకుండా ఫుల్ బిజీగా ఉన్నాడు. సలార్, ప్రాజెక్ట్ కె, మారుతి సినిమాలను నాన్‌స్టాప్‌గా కొట్టేస్తున్నాడు. కానీ ఈ మధ్య ప్రభాస్ అనారోగ్యంతో బాధపడుతున్నాడనే న్యూస్ ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతోంది. ఈ నేపథ్యంలో షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి.. విదేశాలకు వెళ్లాడనే టాక్ నడుస్తోంది. కాదు నార్మల్ హెల్త్ చెకప్ కోమే ఇటలీకి వెళ్లాడని కొందరు అంటున్నారు. అసలు ప్రభాస్ హెల్త్ గురించి ఎందుకిలా ప్రచారం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ లేటెస్ట్ అప్డేట్ మాత్రం వీటికి చెక్ పెట్టేలాగే ఉంది. ప్రభాస్ నటిస్తున్న హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ ‘సలార్’ షూటింగ్లో భాగంగానే ఇటలీకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇటలీలో కొన్ని భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇప్పటికే సలార్ మూవీ షూటింగ్ చివరి దశకు చేరకుంది. మరో 10, 15 శాతం మాత్రమే బ్యాలెన్స్ ఉందని అంటున్నారు. ఇటలీ షెడ్యూల్ అయిపోగానే.. నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ఉంటుందని అంటున్నారు. అతి త్వరలోనే ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టనున్నారు. ఇక షూటింగ్ కంప్లీట్ అవగానే పోస్ట్ ప్రొడక్షన్స్ పై దృష్టి పెట్టనున్నాడు ప్రశాంత్ నీల్. సలార్ మూవీని సెప్టెంబర్ 28న రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ వచ్చేసి ప్రాజెక్ట్ కె, మారుతి సినిమాలను కంప్లీట్ చేయనున్నాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డ వంగతో ‘స్పిరిట్’ మూవీ చేయబోతున్నాడు. ఆ తర్వాత బలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్త్ ఆనంద్‌తో కలిసి భారీ ప్రాజెక్ట్‌కు సైన్ చేశాడు.