Mahesh Babu ‘SSMB 28’ లీక్ అయిన ఫస్ట్ లుక్ వీడియో!
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ 28 పై భారీ అంచనాలున్నాయి. అతడు, ఖలేజా తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. రీసెంట్గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి ఖుషీ అవుతున్నారు ఫ్యాన్స్.
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ 28 పై భారీ అంచనాలున్నాయి. అతడు, ఖలేజా తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. రీసెంట్గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి ఖుషీ అవుతున్నారు ఫ్యాన్స్. బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ పండగ చేసుకుంటున్నారు. మహేష్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాని షేక్ చేసింది. ఈ సినిమాలో త్రివిక్రమ్ మాస్ డోస్ కాస్త ఎక్కువగానే ఇవ్వబోతున్నాడు. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ మూవీని విడుదల చేయబోతున్నారు. అయితే ఇకపై ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ వస్తాయనుకున్నారు అభిమానులు. కానీ రిలీజ్కు చాలా సమయం ఉంది కాబట్టి.. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిటింగ్ తప్పదంటున్నారు మేకర్స్. ఈ సినిమా నెక్స్ట్ మాసివ్ అప్డేట్ని సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే నెలలొ ఇస్తామని.. నిర్మాత నాగ వంశీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కానీ ఆన్ సెట్స్ లీకులను ఆపడం మాత్రం కష్టమే. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి లీకులు జరుగుతునే ఉన్నాయి. తాజాగా ఫస్ట్ లుక్ చిత్రీకరణకు సంబంధించిన వీడియో కూడా లీక్ అయ్యింది. జస్ట్ పోస్టర్కే పండగ చేసుకుంటున్నారు అభిమానులు.. ఇక ఈ వీడియో చూసి మాస్ మెంటల్ అంటు రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఏదేమైనా.. ఎస్ఎస్ఎంబీ 28 ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.