Prabhas : ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో సలార్ పైనే భారీ ఆశలు పెట్టుకున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. అందుకు తగ్గట్టే ప్రశాంత్ నీల్ 'సలార్'ను తెరకెక్కిస్తున్నాడు. ఆదిపురుష్ సినిమా ప్రకటించినప్పటి నుంచి ట్రెండిగ్లోనే ఉంటోంది. కానీ టీజర్ తర్వాత సీన్ మారిపోయింది. డైరెక్టర్ ఓం రౌత్ పై ఎక్కడ లేని డౌట్స్ వచ్చేశాయి.
ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్, సలార్ సినిమాలు అనుకున్న సమయానికే రిలీజ్ చేస్తామని చెబుతున్నారు మేకర్స్. అయినా అభిమానులకు ఎక్కడో చిన్న డౌట్.. అది కూడా ఆదిపురుష్ పైనే. ఈ సినిమా ఏ మాత్రం పోస్ట్ పోన్ అయినా.. సలార్, ప్రాజెక్ట్ కె షెడ్యూల్ మొత్తం డిస్టర్బ్ అవనుంది. అందుకే చెప్పిన టైమ్‌కి ఆదిపురుష్ రిలీజ్ అవాలని అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. దర్శకుడు ఓం రౌత్ సైతం పదే పదే దీని పై క్లారిటీ ఇస్తు వస్తున్నాడు. రీసెంట్గా శ్రీరామనవమికి పోస్టర్‌ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు హనుమాన్ జయంతికి కూడా పోస్టర్‌తోనే సరిపెట్టాడు. ఆదిపురుష్ సినిమాలో హనుమాన్ పాత్రను దేవదత్త నాగే పోషిస్తున్నారు. తాజాగా హనుమాన్కు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మరోసారి ఈ సినిమాను జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలియజేశారు. ప్రజెంట్ ఆదిపురుష్ గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. ఎట్టిపరిస్థితుల్లోను ఆదిపురుష్ జూన్ 16న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు ఓం రౌత్. ఇక సలార్ రిలీజ్ డేట్ పై కూడా సాలిడ్ క్లారిటీ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. అప్పుడెప్పుడో ఓ పోస్టర్‌తో సలార్ రిలీజ్ డేట్ ప్రకటించగా.. ఇప్పుడు ఓ మోషన్ వీడియోతో.. ఈ ఏడాదికి సలార్ వస్తుందా రాదా అనే డౌట్స్‌కు చెక్ పెడుతూ.. మరోసారి రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ‘2023 సెప్టెంబర్ 28న మీ మతి పోగొట్టే పవర్ ఫుల్ ఫ్యాకేజ్‌తో ది మోస్ట్ వైలెంట్ మ్యాన్ వస్తున్నాడు’ అని హోంబలే ఫిలింస్ వారు ప్రకటించారు. ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ జరుగుతున్న సలార్ మూవీకి.. త్వరలోనే గుమ్మడికాయ కొట్టనున్నారు. ఏదేమైనా సలార్, ఆదిపురుష్ సాలిడ్ క్లారిటీ ఇచ్చేశారనే చెప్పొచ్చు.