Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాస్ట్ ఫిల్మ్ 'రాధేశ్యామ్' ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. కానీ ఇప్పుడున్న లైనప్ మాత్రం ప్రభాస్‌కు భారీ విజయాలను తెచ్చిపెట్టడం ఖాయం. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న 'ఆది పురుష్' జూన్ 16న రిలీజ్ కాబోతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాస్ట్ ఫిల్మ్ ‘రాధేశ్యామ్’ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. కానీ ఇప్పుడున్న లైనప్ మాత్రం ప్రభాస్‌కు భారీ విజయాలను తెచ్చిపెట్టడం ఖాయం. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ‘ఆది పురుష్’ జూన్ 16న రిలీజ్ కాబోతోంది. ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో చేస్తున్న ‘సలార్’ సెప్టెంబర్ 28న విడుదల కాబోతోంది. నాగ్ అశ్విన్‌తో చేస్తున్న టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ప్రాజెక్ట్ కె’ 2024 సంక్రాంతికి రానుందని అంటున్నారు. ఆ తర్వాత మారుతి సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాలు పూర్తవగానే మరో క్రేజీ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించడానికి రంగం సిద్దమవుతోంది. ఇప్పటికే అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డితో ‘స్పిరిట్’ అనే టైటిల్లో భారీ ప్రాజెక్ట్ ప్రకటించాడు. ప్రస్తుతం సందీప్ బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా అయిపోగానే సందీప్ రెడ్డీ ‘స్పిరిట్’ మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో ఈ టాలెంటెడ్ డైరెక్టర్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. అసలు ఈ ‘రా’ కాంబినేషన్ సెట్ అవడమే ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చింది. స్పిరిట్ పై భారీగా అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే అంతకు మించి అనేలా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని చెప్పుకొచ్చాడు సందీప్. ‘యానిమల్’ తరువాత ‘స్పిరిట్’ ఉంటుంది.. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఆ సినిమా ఉంటుంది. ప్రభాస్ అన్న అంటే ఎక్స్ పెక్టేషన్స్ వుంటాయి కదా’ అని సందీప్ రెడ్డి చెప్పుకొచ్చాడు. దాంతో స్పిరిట్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంటుందనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఇందులో ఫస్ట్ టైం ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.