Prabhas : ‘సలార్’ భారీ డిమాండ్.. ఏపికే 100 కోట్లా!?
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో.. సలార్ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా వెయ్యి కోట్ల బొమ్మ అవుతుందని ఫిక్స్ అయిపోయారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇప్పటి వరకు లీక్ అయిన ఫోటోలకే రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక టీజర్, గ్లింప్స్ రిలీజ్ అయితే.. సలార్ హైప్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోతుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో.. సలార్ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా వెయ్యి కోట్ల బొమ్మ అవుతుందని ఫిక్స్ అయిపోయారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇప్పటి వరకు లీక్ అయిన ఫోటోలకే రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక టీజర్, గ్లింప్స్ రిలీజ్ అయితే.. సలార్ హైప్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోతుంది. కెజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్.. ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు. రెండు భాగాలుగా రాబోతోందనే ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తంగా సలార్ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమంటున్నారు. అందుకే.. బిజినెస్ పరంగా ఈ సినిమాకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే ఓటీటీ సంస్థలు డిజిటల్ రైట్స్ కోసం పోటీ పడుతున్నట్టు టాక్. అంతేకాదు.. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ఏకంగా 200 కోట్లు ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పుడు థియేట్రికల్ రైట్స్‌కు కూడా భారీ డిమాండ్ ఏర్పడినట్టు తెలుస్తోంది. ఒక్క ఏపీ థియేట్రికల్ రైట్స్ కోసమే 100 కోట్ల ఆఫర్ వచ్చిందట. ఏపికే ఇంత డిమాండ్ ఉంటే.. మిగతా ప్రాంతాల్లో సలార్ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరగడం పక్కా అంటున్నారు. త్వరలోనే ఈ బిజినెస్ డీల్ క్లోజ్ చేయనున్నారట. ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ కిరగందుర్.. దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. జగపతి బాబు, మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కానుంది. సెప్టెంబర్ 28న గ్రాండ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.