Prabhas : ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో.. సలార్ పైనే అందరి దృష్టి ఉంది. కెజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడంతో.. అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ప్రభాస్ కటౌట్‌కి ప్రశాంత్ నీల్ ఎలివేషన్‌ను ఊహించుకొని గాల్లో తేలుతున్నారు అభిమానులు.
ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో.. సలార్ పైనే అందరి దృష్టి ఉంది. కెజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడంతో.. అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ప్రభాస్ కటౌట్‌కి ప్రశాంత్ నీల్ ఎలివేషన్‌ను ఊహించుకొని గాల్లో తేలుతున్నారు అభిమానులు. ఇప్పటి వరకు కనీసం టీజర్ కూడా రిలీజ్ చేయలేదు.. కానీ సలార్ గురించి సోషల్ మీడియాలో ఎలాంటి అప్టేడ్ వచ్చిన ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఓ హాలీవుడ్ అప్డేట్ వాళ్లకు మరింత కిక్ ఇస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కిస్తున్నారని తెలుసు. కానీ ఇప్పుడు పాన్ వరల్డ్ రేంజ్లో టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ట్రిపుల్ ఆర్ సినిమాతో ఇండియన్ మూవీస్‌కి పాన్ వరల్డ్ మార్కెట్ ఓపెన్ అయ్యింది. దాంతో సలార్ మూవీని.. ప్రపంచ వ్యాప్తంగా రీచ్ అయ్యేలా, హాలీవుడ్ టార్గెట్‌గా, ఇంగ్లీష్‌లో డబ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. మొత్తంగా ఈ సినిమాను 10 భాషలకు పైగా డబ్బింగ్ చేసి రిలీజ్ చేయబోతున్నారట. అదే జరిగితే ప్రాజెక్ట్ కె కంటే ముందే.. ప్రభాస్ పాన్ వలర్డ్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాడని చెప్పొచ్చు. ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ కె’ని పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. కానీ ఇప్పుడు సలార్ కూడా అదే రేంజ్లో రాబోతోందని అంటున్నారు. అయితే దీనికంటే ముందే.. ఆదిపురుష్ కూడా ఇంగ్లీష్‌లో ప్లాన్ చేస్తున్నారనే టాక్ ఉంది. ఈ మూడు సినిమాలు ఏడు నెలల గ్యాప్‌లో థియేటర్లోకి రాబోతున్నాయి. అయితే సలార్ మూవీని నిజంగానే ఇంగ్లీష్‌లో ప్లాన్ చేస్తున్నారా.. లేదా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ వారు భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. మళయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నాడు.