పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ(Narayanamurthy) మూర్తి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం యూనివర్సిటీ (University Movie). ఈ మూవీని స్నేహా చిత్ర పిక్చర్స్ బ్యానర్ నిర్మించింది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘యూనివర్సిటీ’ మూవీ మే 26న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రసాద్ ల్యాబ్లో యూనివర్సిటీ చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ అల్లం నారాయణ, ఆంధ్రజ్యోతి శ్రీనివాస్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణ, ప్రొఫెసర్ కోయి కోటేశ్వరరావు, తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మి నారాయణ వారణాసి, తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ వై జే రాంబాబు పాల్గొన్నారు.
శ్రీనివాస్ మాట్లాడుతూ చరిత్రలో జరిగిన సంఘటనలు, ఇప్పుడు జరుగుతున్న వాటిని కళ్లకు కట్టినట్లు చూపించారన్నారు. సినిమా(University Movie) ఘన విజయం సాధించాలన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ యూనివర్సిటీ మూవీ ఒక సందేశాత్మక చిత్రమని అన్నారు. యూనివర్సిటీ సినిమా చాలా బాగుందని, సమాజంలో జరిగే అక్రమాలు, అన్యాయాలే ఇతివృత్తాలుగా తీసుకుని సినిమా తీశారని తెలిపారు.
ఆర్ నారాయణ మూర్తి(Narayanamurthy) మాట్లాడుతూ పేపర్ లీకేజ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశంలో చాలా జరుగుతున్నాయన్నారు. విద్య, వైద్యం రెండు జాతీయం చెయ్యాలని చెప్పేదే తన యూనివర్సిటీ సినిమా(University Movie) అని తెలిపారు. ఈ నెల 26న సినిమా విడుదల కానుందని, ఇందులో 5 పాటలు ఉన్నట్లు తెలిపారు. ప్రేక్షకులు సినిమాను ఆదరించాలని కోరారు.