»Politics Over The Kerala Story What Is The Reason Behind It
The Kerala Story: వివాదమా.. సినీ రాజకీయమా.. ది కేరళ స్టోరీలో.. నిజమేంటి
తాజాగా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న వివాదాస్పద సినిమా ‘ది కేరళ స్టోరీ’(The Kerala Story). విడుదలకు ముందు నుంచే సినిమాను థియేటర్ల(theatres)లోకి రాకుండా బ్యాన్(Ban) చేయాలని చాలా వర్గాలు ప్రయత్నించాయి. నిరసనలు, ఆందోళన నడుమ సినిమా విడుదలై సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది.
The Kerala Story: తాజాగా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న వివాదాస్పద సినిమా ‘ది కేరళ స్టోరీ’(The Kerala Story). విడుదలకు ముందు నుంచే సినిమాను థియేటర్ల(theatres)లోకి రాకుండా బ్యాన్(Ban) చేయాలని చాలా వర్గాలు ప్రయత్నించాయి. నిరసనలు, ఆందోళన నడుమ సినిమా విడుదలై సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. కానీ ఇప్పటికీ సినిమా పై వివాదాలు సమసిపోలేదు. వాస్తవ సంఘటనల ఆధారంగానే చిత్రం రూపొందించినట్లు దర్శక(Director), నిర్మాత(Producer)లు ప్రకటించారు. కానీ సినిమా చూస్తే ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని తీసిన సినిమాగా అనిపిస్తుంది. అయితే, ఇందులో అన్నీ అబద్ధాలే చూపించారని, వక్రీకరణలతో సినిమా తీశారని కొన్ని రాజకీయ పక్షాలు, ఒక వర్గం ప్రేక్షకులు(Audians) ఆందోళన చేస్తున్నారు. వాళ్లు ఈ చిత్రాన్ని ప్రదర్శించొద్దంటూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
తమ రాష్ట్రాన్ని కించపరిచేందుకే ఈ సినిమా తీశారని కేరళ ప్రభుత్వ వాపోతుంది. బీజేపీయేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలు సినిమాపై నిషేధం విధిస్తుంటే, బీజేపీ(BJP) పాలిత రాష్ట్రాలు సినిమాకు పన్ను రాయితీ కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నాయి. వివాదాలు నడిచాయి కానీ..ఒక సినిమా విషయంలో రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఇంత భిన్నంగా వ్యవహరించడం గతంలో ఎప్పుడూ జరగలేదు. ఈ చిత్రాన్ని తమిళనాడు(Tamilnadu), పశ్చిమ బెంగాల్(west bengal) రాష్ట్రాలు నిషేధించాయి. తమ రాష్ట్రాల్లో చిత్రాన్ని ప్రదర్శించకుండా నిర్ణయం తీసుకున్నాయి. కేరళ(Kerala) రాష్ట్రం కూడా నిషేధం విధించేందుకు ప్రయత్నించినప్పటికీ కోర్టు(Court) ఆదేశాలతో ఆచరణ సాధ్యం కాలేదు. మరోవైపు ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh), మధ్య ప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్రాల్లో చిత్రానికి పన్ను రాయితీలు ఇస్తూ అక్కడి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి.
దురుద్దేశాలతో నిర్మించిన చిత్రంగా భావించి ది కేరళ స్టోరీ చిత్రాన్ని తమిళనాడులో ఎంకే స్టాలిన్ ప్రభుత్వం నిషేధించింది. అయితే, వాస్తవ సంఘటనలకు అద్దం పడుతూ రూపొందించిన ఈ చిత్రాన్ని అందరూ చూడాలని ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh) ప్రభుత్వం సూచిస్తోంది. ఒక వర్గం ఎలాంటి అరాచకాలకు పాల్పడిందో అందరూ తెలుసుకోవాలని, అందుకే సినిమాకు పన్ను రాయితీ కల్పిస్తున్నామని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ఒకే సినిమాపై ఇటు నిషేధం విధించడం.. అటు పన్ను రాయితీ ఇచ్చి ప్రోత్సహించడం మన ప్రభుత్వాలకే చెల్లింది.