»How A Farmer Produces Worlds Most Expensive Mangoes At Nearly %e2%82%b9 19000 Each
Mangoes: ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన మామిడి పండు, ధరెంతో తెలుసా?
ఎండాకాలం వచ్చిందంటే మనమంతా మామిడి పండ్ల కోసం ఎదురుచూస్తూ ఉంటాం. ఇది మ్యాంగో సీజన్ కాబట్టి, మనకు కూడా ఎక్కడ కావాలంటే అక్కడ మామిడి పండ్లు విరివిగా లభిస్తాయి. మామిడి పండు కిలో ధర ఎంత ఉంటుంది..? మహా అయితే 200 ఉంటుందేమో. కదా. కానీ ఓ ప్రాంతంలో మామిడి పండ్లు కొనాలంటే జేబులు ఖాళీ అయయిపోతాయి. అక్కడ ఒక్కో మామిడి పండు రూ.19వేలు నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన మామిడి పండు ఇది. మరి ఆ మామిడి పండు స్పెషాలిటీ ఏంటో మనమూ తెలుసుకుందామా..
మామూలుగా మన దేశంలో రైతులు కొన్ని సంవత్సరాల పాటు సాగు వచ్చేలా మామిడి తోటలు వేస్తూ ఉంటారు. అయితే, ఈ ఖరీదైన మామిడి పండ్లను జపాన్ లో పండిస్తారు. వీటిని ప్రత్యేక మైన ఉష్ణోగ్రత వద్ద పెంచుతారట. వీటిని మంచులో పడిస్తారు. అందుకే వీటిని హకుగిన్ నో తాయో అని పిలుస్తారు. అంటే జపాన్ లో మంచు సూర్యుడు అని అర్థమట. హిరోయుకి నకగవ అనే రైతు వీటిని పండిస్తున్నాడు.
గ్రీన్ హౌస్ మధ్యలో, ఎప్పుడూ కూడా 36 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య మామిడి సాగు అవుతుంటుంది. తాను చేపట్టిన ఈ ప్రత్యేక మామిడి సాగు ఏదో ఒక రోజు తనకు కాసుల వర్షం కురిపిస్తుందని నకగవ కూడా ఎప్పుడూ ఊహించలేదు. ప్రపంచంలో నేడు ఖరీదైన మామిడి రకాల్లో ఇది కూడా ఒకటి. ఒక్కో పండు డిమాండ్ ఆధారంగా కొన్ని సందర్భాల్లో 300 డాలర్లు (రూ.25వేలు) కూడా పలుకుతుంది.
హొక్కడో ద్వీపంలోని ఓతోఫుకేలో గ్రీన్ హౌసులో వీటిని సేంద్రీయ విధానంలో, ఎలాంటి రసాయనాలూ వాడకుండా సాగుచేస్తున్నాడు. 2011 నుంచి ఆ చెట్ల నుంచి పండ్లు రావడం మొదలయ్యాయట. ఈ పంట గురించి చెప్పినపుడు మొదట్లో అందరూ నవ్వారని, కానీ సేంద్రీయ విధానంలో పండిన పండు రుచి బావుంటుందని, దానికి మరింత రుచి జత చేయడానికి ఇలా ప్రయత్నించానని నకగవా అంటున్నాడు. శీతకాలంలో కురిసే మంచును భద్రపరిచి వేసవిలో గ్రీన్హౌసుకు చల్లదనం కోసం వాడతాడు.
చలికాలంలో పంటకు వేడినీళ్ల ద్వారా సహజ ఉష్ణాన్ని అందించి సమశీతోష్ణ వాతావరంణంలో పంట కాలాన్ని పెంచి రుచికరమైన పళ్లు పండిస్తున్నాడు. సీజన్లో కేవలం 5 వేల పండ్లు మాత్రమే దిగుబడి అవుతాయి. హకుగిన్ తో తాయో అనే బ్రాండెడ్ పండ్లు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయని, మిగతా పళ్లకంటే 15 శాతం ఎక్కువ తియ్యగా ఉంటాయని నకగవా చెబుతున్నారు. ఈ పండు కండ వెన్నలా మెత్తగా ఉంటుందన్న ఆయన… పండిన పళ్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుబోతుంటాయని ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. అతను 2014లో పండించిన ఓ మామిడి పండు రూ. 33 వేలకు అమ్ముడుపోయి ప్రపంచ రికార్డు సృష్టించింది.