Tarakaratna: కంటతడి పెట్టిస్తున్న తారకరత్న భార్య పోస్ట్
టాలీవుడ్(Tollywood) హీరో నందమూరి తారకరత్న(Tarakaratna) ఇటీవలె కన్నుమూశారు. 23 రోజుల పాటు బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఫిబ్రవరి 18న తారకరత్న ప్రాణాలు విడిచారు.
టాలీవుడ్(Tollywood) హీరో నందమూరి తారకరత్న(Tarakaratna) ఇటీవలె కన్నుమూశారు. 23 రోజుల పాటు బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఫిబ్రవరి 18న తారకరత్న ప్రాణాలు విడిచారు. దీంతో నందమూరి ఇంట విషాదం నెలకొంది. తాజాగా తారకరత్న(Tarakaratna) చిన్న కర్మ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నందమూరి కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు. తారకరత్న(Tarakaratna) లేడనే వార్తను ఆయన భార్య అలేఖ్య రెడ్డి(Alekhya Reddy) జీర్ణించుకోలేకపోయారు. కుటుంబీకుల వద్ద కన్నీరు మున్నీరయ్యారు.
తారకరత్న(Tarakaratna) ను గుర్తు చేసుకుని అలేఖ్య రెడ్డి(Alekhya Reddy) సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో హ్యాపీ హ్యాపీ బర్త్ డే టు బెస్ట్ హస్బెండ్ అండ్ వండర్ ఫుల్ హ్యుమన్ అంటూ చెప్పారు. ఆ తర్వాత సో బాడ్లి మిస్ యు నాన్న..ఐలవ్ యు సో మచ్ అని కూతురు నిష్క చెప్పినట్లు అలేఖ్య రెడ్డి(Alekhya Reddy) ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం అలేఖ్య రెడ్డి(Alekhya Reddy) పెట్టిన పోస్టు అందర్నీ కలచివేస్తోంది. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన భర్త తారకరత్న లేడనే విషయాన్నీ అలేఖ్య రెడ్డి(Alekhya Reddy) జీర్ణించుకోలేకపోతోంది.