పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ మధ్యనే హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమాను ప్రారంభించారు. తాజాగా నేడు మరో క్రేజీ ప్రాజెక్టును లాంచ్ చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాత అయిన డివివి దానయ్య నిర్మాణంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని ఆ నిర్మాణ సంస్థ ఇటీవలె ప్రకటించింది. నేడు ఆ మూవీని అఫీషియల్ గా లాంచ్ చేశారు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ ఈవెంట్ కు నిర్మాత అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబులు హాజరయ్యారు.
సాహో సినిమా దర్శకుడు సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సాహో సినిమా అనుకున్నంత హిట్ అవ్వకపోయినా ఆ మూవీలో యాక్షన్ సీక్వెన్స్, హీరో క్యారక్టరైజేషన్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ”ది కాల్ హిమ్ OG” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో పవన్ పంజా మూవీ తరహాలో కనిపించనున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నాడు.