Natural Star Nani : 'దసరా' సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగిపోయాడు. అయితే ముందుగా నార్త్‌లో భారీ ఎత్తున్న ప్రమోట్ చేస్తున్నాడు. ముంబై, లక్నో అంటు తెగ తిరిగేస్తున్నాడు.
‘దసరా’ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగిపోయాడు. అయితే ముందుగా నార్త్‌లో భారీ ఎత్తున్న ప్రమోట్ చేస్తున్నాడు. ముంబై, లక్నో అంటు తెగ తిరిగేస్తున్నాడు. ట్రైలర్ ఈవెంట్ కూడా అక్కడే పెట్టుకున్నాడు. ఈ సినిమా పై నాని చాలా నమ్మకంగా ఉన్నాడు. అందుకే ప్రమోషన్ భారమంత తన భుజాల మీదే వేసుకున్నాడు. పైగా ఈ సినిమా భారీ టార్గెట్ ఫిక్స్ చేసుకుందని తెలుస్తోంది. నాని కెరీర్లోనే దసరా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. దాదాపు 65 కోట్లు ఖర్చు చేశారు. అందుకు తగ్గట్టే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని అంటున్నారు. ఇక టీజర్ చూసిన తర్వాత నాని సినిమాకు పోటీ పెరిగిందనే టాక్ ఉంది. మొత్తంగా వంద కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. నాని ఖచ్చితంగా వంద కోట్ల క్లబ్లో చేరడం పక్కా అంటున్నారు. అంతేకాదు నాని టార్గెట్ 150 కోట్లు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. అందుకే గట్టిగా ప్రమోషన్స్ చేస్తున్నాడని అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే పుష్ప, ఆర్ఆర్ఆర్, కెజియఫ్, కాంతార, కార్తికేయ2.. సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. అందుకే దసరా కంటెంట్ ఏ మాత్రం జనాలకు కనెక్ట్ అయినా.. నానికి నిజంగా దసరా పండగే. ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా.. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. మార్చి 30న దసరా రిలీజ్ కాబోతోంది. మరి దసరా.. నానికి పాన్ ఇండియా స్టార్ డమ్ ఇస్తుందేమో చూడాలి.