»Nani With Flop Director This Time Its Not A Comedy
Nani: ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో నాని.. ఈసారి కామెడీ కాదు!
న్యాచురల్ స్టార్ నాని ఇటీవలె దసరా సినిమాతో మాసివ్ పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడిని పరిచయం చేశాడు. ఇక ఈ సినిమా తర్వాత శౌర్యువ్ అనే కొత్త దర్శకుడితో 30వ సినిమా చేస్తున్నాడు నాని. ఇందులో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఇప్పుడు మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
శ్యామ్ సింగరాయ్‌తో బ్లాక్ బస్టర్ కొట్టిన నాని.. ఆ తర్వాత ‘అంటే సుందరానికి’ అనే కామెడీ సినిమా చేశాడు. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత దసరాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు నాని. ప్రస్తుతం శౌర్యువ్ అనే కొత్త డైరెక్టర్‌తో నాని 30 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హాట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత మరోసారి నాని ఫ్లాప్ డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది.
అంటే సుందరానికి కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. కొత్త సినిమాకు రంగం సిద్దం చేస్తున్నారట. ఇప్పటికే వివేక్ ఆత్రేయకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడట. ఈ సినిమాని ఆర్ఆర్ఆర్ నిర్మాత డివివి దానయ్య నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబందించిన అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. అయితే ‘అంటే సుందరానికి’ సినిమాతో కామెడీ ట్రై చేసిన ఈ కాంబో.. ఈసారి డార్క్ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు నాని ఈ తరహా చిత్రాల్లో నటించలేదు. దాంతో ఫస్ట్ టైం ఓ డార్క్ థ్రిల్లర్‌లో నటించబోతున్నాడని చెప్పొచ్చు. ఇందులో నాని పాత్ర వైవిధ్యంగా కొత్తగా వుంటుందట. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.