నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అమిగోస్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇందులో కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో కనిపించనున్నాడు. గిబ్రాన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చారు.
ఈ మూవీని ఫిబ్రవరి 10వ తేదీన రిలీజ్ చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ వేగంగా సాగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కర్నూలులోని శ్రీరామ థియేటర్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ సినిమాతో ఆషిక రంగనాథ్ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. గత ఏడాది కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో సక్సెస్ ను అందుకున్నారు. ఆ సినిమా భారీ హిట్ గా నిలిచింది. దీంతో తన తదుపరి సినిమా అయిన అమిగోస్ పై ఫ్యాన్స్ అంచనాలు ఎక్కువగా పెట్టుకున్నారు.