సమంత ప్రధాన పాత్రలో ‘శాకుంతలం’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. గుణశేఖర్ సొంత బ్యానర్లో ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా దిల్ రాజు ఉన్నారు. ఈ సినిమాపై సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా సినిమా గురించి ఓ కీలక అప్ డేట్ వచ్చింది. ‘శాకుంతలం’ సినిమా నుంచి చిత్ర యూనిట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది. ‘మల్లికా మల్లికా .. మాలతీ మాలిక, చూడవా .. చూడావా .. ఏడే నా ఏలిక’ అంటూ సాగే ఈ పాట అద్భుతంగా ఆకట్టుకుంటోంది.
ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా విడుదలైన పాటను ప్రముఖ గాయని రమ్య బెహ్రా ఆలపించారు. ఈ సినిమాలో శకుంతలగా సమంత నటిస్తుండగా దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించారు. కీలక పాత్రలలో మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, గౌతమి కనిపించనున్నారు. ఫిబ్రవరి 17వ తేదిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది.