మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) ఇంటర్వ్యూలో ఒక విషయాన్ని బయటపెట్టాడు.రియల్ లైఫ్లో తను ఒక మిస్టేక్ చేసాడని.. ఆ మిస్టేక్ వల్ల సూసైడ్ (Suicide) కూడా చేసుకోవాలనుకున్నానని ధరమ్ తేజ్ తెలిపాడు.చదువుకునే రోజుల్లోనే ఒక అమ్మాయిని ప్రేమించాడంట. అయితే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి.. ఇంట్లో వాళ్లకు చెప్పాడంట. ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే.. ముందే ఏదైనా సంపాదించు.. ఆ తర్వాత కదా పెళ్లి (wedding) అని ఆపేసారంట.
దానితో ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళు బలవంతం చేయడంతో ఆ అమ్మాయి ఇంకొక పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అంట. ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది అన్న విషయం తెలియగానే సాయిధరమ్ తేజ్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడంట. కానీ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తనకి ధైర్యం చెప్పి.. అలాంటి పనులు చేయకూడదని గట్టిగా చెప్పి.. తన కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టమని చెప్పడం వలన తాను ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డాడంట. మొత్తానికి సాయి ధరంతేజ్ కూడా ప్రేమలో ఫెయిల్ అయ్యాడు అన్నమాట.సాయి ధరమ్ తేజ్ హీరోగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్రలో బ్రో సినిమా(Bro movie) రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే.ఈ సినిమా ఇప్పుడు 28వ తేదీ విడుదలకు విడుదల అవుతుంది.