ప్రస్తుతం ఇండియాలో మంచి క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో ‘ఇండియన్-2(Indian-2)’’ ఒకటి. రెండున్నర దశాబ్దాల కిందట సంచలనం రేపిన ‘ఇండియన్/భారతీయుడు’ సినిమాకు కొనసాగింపుగా లెజెండరీ డైరెక్టర్ శంకర్ (Director Shankar) ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ‘ఇండియన్’లో హీరోగా నటించిన కమల్ హాసనే (Kamal Haasan) ఇప్పుడు కూడా లీడ్ రోల్ చేస్తున్నాడు.నాలుగేళ్ల కిందటే మొదలైన ఈ సినిమా సెట్లో జరిగిన ఘోర ప్రమాదం, కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. రెండేళ్లకు పైగా షూటింగ్ ఆపేశారు. ఐతే దర్శక నిర్మాతలు, హీరో మాట్లాడుకుని గత ఏడాది చివర్లో మళ్లీ చిత్రీకరణను పున:ప్రారంభించారు.
ఇప్పటికే మూవీ షూటింగ్ కూడా పూర్తయింది. వచ్చే ఏడాది వేసవిలో విడుదల అనుకుంటున్నారు. ప్రస్తుతం శంకర్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు సినిమా బిజినెస్ చర్చలు మొదలయ్యాయి. ఈ పాన్ ఇండియా చిత్రం (Pan India movie) డిజిటల్ హక్కులు కళ్లు చెదిరే ధరకు అమ్ముడైనట్టు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇండియన్-2 డిజిటల్ రైట్స్ దాదాపు రూ.200 కోట్లకు నెట్ ఫ్లిక్స్ ఓటీటీ దక్కించుకున్నట్టు టాక్ వినిపిస్తోంది.శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ నటిస్తున్న ఇండియన్-2 సినిమా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. శంకర్ పనితీరు పట్ల పూర్తి సంతృప్తితో ఉన్న కమల్ ఇటీవల ఆయనకు రూ.8 లక్షల విలువైన వాచీని గిఫ్టుగా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh), ప్రియా భవానీ శంకర్, ఎస్జే సూర్య, సముద్రఖని, బాబీ సింహా తదితరులు నటిస్తున్నారు.