ఇప్పుడు టామాట (Tomato) కు రాజయోగం పట్టింది. ధర ఆకాశన్ని అంటడంతో టామాట సాగుచేస్తున్నా రైతులు కోటీశ్వరులు అవుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు పంట తరిలించే వాహనాలకు పోలీసుల కాపల (Police Security) ఉంటున్నారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా(Asifabad District) వాంకిడి వద్ద 15 లక్షల విలువైన టమాటోల లారీ బోల్తా పడగా టమాటో అధిక ధరల వల్ల దొంగలు ఎత్తుకుపోకుండా పోలీసులు కాపలా కాయాల్సి వచ్చింది. లేదంటే జనం వచ్చి ఎవరికి దొరికిన టమాటాలు వాళ్ళు పట్టుకుపోయే ప్రమాదం ఉంది. అందుకే పోలీసుల రక్షణ ఏర్పాటు చేసారు. దీనితో లారీ బోల్తా పడిన ప్రదేశంలో టమాటాలకు కాపలాగా పోలీసులు ఉన్నారు.
టమాటాలు ట్రేలలో ఉంచగా అక్కడే పోలీసులు ఉంటూ వాటిని ఎవరు ఎత్తుకుపోకుండా కాపలా కాశారు.మొత్తానికి టమాటా ఇప్పుడు మీసం మెలేస్తోంది.రోజులన్నీ ఒకేలా ఉండవు.. బళ్ళు ఓడలు అవుతాయి.. ఓడలు బళ్ళు అవుతాయి. రైతులు పండించిన టమాటా మార్కెట్లో అమ్ముడుపోక రూపాయికి ఇచ్చేసిన రోజులున్నాయి. ఆ రూపాయికి అమ్మడం కన్నా గేదెలకు వేసేస్తే మంచిది అనుకునే రోజులూ చూశాం.అసలు పంటను కోయడం.. మార్కెటు కు తీసుకుపోవడం.. కూలీలా ఖర్చు.. రవాణా ఇదంతా చేసినా పావలా మిగలదు, తిరిగి ఎదురు ఖర్చు దండగ అనుకుంటూ పంటను పొలంలోనే వదిలేసిన రైతుల(Farmers)నూ చూశాం.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియా(Social media)లో వైరల్ గా మారాయి. పోలీసులు కాపలా ఉండడం పట్ల టమాటాలకు ఎంత డిమాండ్ వచ్చిందని కొందరు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.