మర్రి చెట్టు కింద ఓ పెద్దాయన టీ షాపు నడుపుతున్నారు. ఆ టీ షాపుకి ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra)కూడా ఫిదా అయిపోయారు.అజిత్ సింగ్ కి చెందిన ఈ టీ దుకాణం పంజాబ్లోని అమృత్సర్లోని ‘గోల్డెన్ టెంపుల్’ సమీపంలో ఉంది. అజిత్ సింగ్ కు కుటుంబం ఉన్నప్పటికీ ‘బాబా’లా జీవిస్తున్నారు. తన షాపులో టీ తాగి ఎవరైనా డబ్బులు ఇస్తే ఆనందంగా తీసుకుంటారు. ఒక వేళ టీ తాగి డబ్బులు ఇవ్వకపోయినా పట్టించుకోరు. ఇదే విధంగా అజిత్ సింగ్ (Ajit Singh) గత 45 ఏళ్లుగా నిరంతరంగా తన దుకాణాన్ని నడుపుతున్నారు.ఆయనను ఆదరిస్తున్న మన హృదయాలు పెద్ద దేవాలయాలు అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు ‘‘అమృత్సర్(Amritsar)లో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.
ఈ సారి నేను అమృత్సర్కు వెళ్లినప్పుడు గోల్డెన్ టెంపుల్(Golden Temple)తోపాటు బాబాజీ ‘టెంపుల్ ఆఫ్ టీ సర్వీస్’కు కూడా తప్పక వెళ్తాను. 40 ఏళ్లుగా ఆయన టీ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆయనను ఆదరిస్తున్న మన హృదయాలు పెద్ద దేవాలయాలు’’ అని మహీంద్రా ట్వీట్ చేశారు. ఓ పెద్ద మర్రి చెట్టు (banyan tree) కింద టీ అమ్ముకుంటున్న వృద్ధుడి వీడియోను మహీంద్రా ట్విటర్లో షేర్ చేస్తు పంజాబ్ లోనే అమృత్ సర్ కు చెందిన అజిత్ సింగ్ అనే పెద్దాయన 40 ఏళ్లుగా అదే చెట్టు తొర్రలో టీ షాపు నిర్వహిస్తున్నారు. స్థానికులు ఆయన్ని బాబా అంటూ ఆప్యాయంగా గౌరవంగా పిలుచుకుంటారు. ప్రతీరోజు ఉదయం 9గంటలనుంచి సాయంత్రం 4 గంటలవరకు టీ షా కొనసాగుతుంది. బాబాజీ టీ ఎంతో బావుంటుందని ఓ కస్టమర్ చెబుతున్నాడు ఈ వీడియోలో.
There are many sights to see in Amritsar. But the next time I visit the city, apart from visiting the Golden Temple, I will make it a point to visit this ‘Temple of Tea Service’ that Baba has apparently run for over 40 years. Our hearts are potentially the largest temples.… pic.twitter.com/Td3QvpAqyl