డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ (MLA Redyanaik) మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మిషన్ భగీరథ వాటర్ తమ ఇంటికి రాలేదని ఎవరైన తనకు కంప్లైంట్ చేస్తే దానికి బాధ్యులైన అధికారిని మహిళలతో తన్నిస్తానని ఎమ్మెల్యే సీరియప్ వార్నింగ్ ఇచ్చారు.ఫకీరాతండాలో మిషన్ భగీరథ నీళ్లు (Mission Bhagiratha Waters) రావడం లేదని ప్రజలు చెపితే 4 నెలల క్రితమే రూ. 5 లక్షలు మంజూరు చేశామని… కానీ ఇప్పటికీ పనులు పూర్తి కాలేదని ఆయన చెప్పారు. ఇలా అయితే తమకు ప్రజలు ఓట్లు ఎలా వేస్తారని అధికారులపై మండిపడ్డారు. ఈ నెల 28 నాటికి లోటుపాట్లను సరిదిద్దుకోవాలని చెప్పారు. రెడ్యా నాయక్ ఇప్పటి వరకు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
వచ్చే ఎన్నికలే (elections) తనకు చివరి ఎన్నికలని, ఆ తర్వాత పోటీ చేయబోనని, ఇంకొక్కసారి తనను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గ్రామాల్లో తిరుగుతూ ఆయన అప్పుడే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.గతంలో మంత్రిగా కూడా పనిచేశాని ఈ సారి ఒక్కసారి తనను గెలిపించాలని ప్రజలకు చేతులు జోడించి వేడుకుంటున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గ్రామాల్లో తిరుగుతూ ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పనులు సరిగ్గా చేయడం లేదని ఇటీవల అధికార పార్టీ నేతలే ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇవే తన చివరి ఎన్నికలంటూ ఆయన కొత్త నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు.