Revanth Reddy: తెలంగాణ మంత్రి హరీశ్ రావు, సీఎం కేసీఆర్పై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవసరం తీరిన తర్వాత వదిలేయడం వారికి అలవాటు అని చెప్పారు. ఏరు దాటాక తెప్ప తగలేయడం మామా అల్లుళ్లకు అలవాటు అని గుర్తుచేశారు. కమ్యూనిస్టులకు కార్యకర్తలు కూడా లేరని ఇటీవల మంత్రి హరీశ్ రావు కామెంట్ చేశారు. ఆ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు.
మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఎలా గెలిచిందని రేవంత్ రెడ్డి (Revanth Reddy) అడిగారు. అక్కడ కమ్యునిస్టుల మద్దతుతో గెలవలేదా అని నిలదీశారు. ఇప్పుడు ఎర్రజెండా మోసేటోడే లేరని మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. హరీశ్, కేసీఆర్.. ఊసరవెల్లులు అని.. వారి గురించి కమ్యూనిస్టు సోదరులు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత వారికి మంచిదని సూచించారు. తెలంగాణ అసెంబ్లీకి మరి కొన్నినెలల్లో ఎన్నిక జరగనున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. అధికార పార్టీపై విమర్శలు చేస్తోంది. జనంలోకి వెళ్లి సమస్యలను తెలుసుకుంటుంది.