Dasara Movie Review : గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని మాస్ పాత్రలో నటించాడు. అలాగే కీర్తి డీ గ్లామర్ పాత్రను పోషించింది. విదేశాల్లో రిలీజ్ అయిన ఈ మూవీ రివ్యూను ట్విట్టర్ ద్వారా పంచుకుంటున్నారు ప్రేక్షకులు. అయితే అసలు విషయం ఏంటి అంటే సినీ సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..
బొగ్గుగనుల్లో మసి పూసికొని బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోస్తున్నాడు న్యాచురల్ స్టార్ నాని. నాని మాసివ్ పర్ఫార్మెన్స్కు ఆడియెన్స్‌తో పాటు సినీ సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. అదిరిపోయే రివ్యూ ఇచ్చాడు. దసరా ఒక స్టన్నింగ్ సినిమా అని.. ఈ సినిమాను చూసి గర్వపడుతున్నానంటూ.. చిత్ర యూనిట్‌కు తన శుభాకాంక్షలు తెలిపాడు. ఊహించని విధంగా సూపర్ స్టార్ నుండి ఇలాంటి రివ్యూ రావడంతో.. దసరా టీమ్ గాల్లో తేలిపోతోంది. మహేష్ ఫ్యాన్స్, నాని ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో మా బాబు ముందుంటాడని.. నానికి సపోర్ట్‌గా మహేష్ పోస్టర్స్‌తో రచ్చ చేస్తున్నారు. ఇక మహేష్ ట్వీట్‌కి నాని అదిరిపోయే రిప్లే ఇచ్చాడు. థ్యాంక్యూ మహేష్ సార్.. మంచి సినిమాలకు మీరిచ్చే వాయిస్ సపోర్ట్.. పోకిరి సినిమాకి మణిశర్మ స్కోర్ అందించినట్టుగా ఉంటుందని రాసుకొచ్చాడు. ప్రస్తుతం మహేష్ ట్వీట్ అండ్ నాని రిప్లై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహేష్ బాబు దసరా గురించి ట్వీట్ చేయడం.. ఈ సినిమాకు మరింత బూస్టింగ్ ఇచ్చినట్టైంది. ఇప్పటికే దసరా మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులుపుతోంది. కొత్త దర్శకుడే అయిప్పటికీ.. నానికి పాన్ ఇండియా స్థాయిలో సాలిడ్ హిట్ అందించాడు శ్రీకాంత్ ఓదెల. నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా దసరా నిలిచింది. మరి మొత్తంగా దసరా ఇంకెంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.