తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ సీనియర్ నిర్మాత కన్నుమూశారు. సీనియర్ ఎన్టీఆర్ తో అడవి రాముడు సినిమా తీసిన నిర్మాత సూర్య నారాయణ కన్నుమూశారు. 84 ఏళ్ల వయసులో ఆయన అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచారు.
కోనసీమకు చెందిన సూర్యనారాయణ చిత్ర ప్రొడక్షన్స్ ను స్థాపించారు. ఎన్టీఆర్, శోభన్ బాబు, బాలయ్య, చిరంజీవి వంటి హీరోలతో ఆయన సినిమాలు చేశారు. ప్రేమబంధం, కుమారరాజా, కొత్తపేట రౌడీ, భలే తమ్ముడు, పవిత్ర ప్రేమ, అడవి రాముడు, కొత్త అల్లుడు వంటి సినిమాలను తెరకెక్కించారు. హిందీలో కూడా అమితాబ్ తో మహాన్ అనే సినిమా చేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సూర్యనారాయణ శుక్రవారం సాయంత్రం మరణించారు. నేడు ఫిలిం నగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.