హైదరాబాద్‌లో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 23వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవం నేపథ్యంలో, బాలకృష్ణ బసవతారకం ఆసుపత్రి (Basavatharakam Hospital) లో కొత్త పరికరాలను ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యాధునిక క్యాన్సర్ చికిత్స(Cancer treatment)కు, సేవాభావానికి చిరునామాగా నిలుస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ (NTR) వ్యక్తిత్వం అందరికీ ఆదర్శప్రాయం అని అన్నారు. మా అమ్మ బసవతారకం కోరిక మేరకు ఆసుపత్రి ఏర్పాటు చేశారని ఆయన వెల్లడించారు. తనను డాక్టర్‌గా చూడాలని తన తండ్రి ఎన్టీఆర్ కోరుకున్నారని, దాంతో మెడికల్ ఎంట్రన్స్ (Medical Entrance) రాశానని బాలయ్య వెల్లడించారు.
సీటు రాదని తెలిసినా నాన్న మాట కాదనలేక రాశానని ఆయన వివరించారు. ఆసుపత్రి కోసం కొన్ని కొత్త పరికరాలు తీసుకువచ్చామని తెలిపారు. బసవతారకం ఆసుపత్రి దేశంలోనే రెండో ఉత్తమ క్యాన్సర్ ఆసుపత్రిగా నిలిచిందని ఆయన సగర్వంగా చెప్పారు. తమకు సహకరిస్తున్న తెలంగాణ (Telangana) ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఇటీవలే దేశంలో రెండో ఉత్తమ క్యాన్సర్ ఆసుపత్రిగా బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని ఔట్ లుక్ ఇండియా పత్రిక (Outlook India magazine) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో యువ హీరోయిన్ శ్రీలీల, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు(PV Sindhu), మహిళా క్రికెటర్ ప్రణవి చంద్ర తదితరులు పాల్గొన్నారు.