Naga Chaitanya : ‘కస్టడీ’ నుంచి ‘హెడ్ అప్ హై’ సాంగ్ రిలీజ్
కస్టడీ సినిమా (Custody Movie) నుంచి ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలు విడుదలయ్యాయి. వాటికి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ (Teaser) కూడా అందర్నీ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను చిత్ర యూనిట్ రిలీజ్(First Single Release) చేసింది.
అక్కినేని నాగచైతన్య(Akkineni Nagachaitanya) నటిస్తున్న తాజా సినిమా కస్టడీ (Custody). కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు(Venkat prabhu) దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీతో నాగ చైతన్య తమిళ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. గతంలో ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలో పోలీసు పాత్రలో నాగచైతన్య కనిపించాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు కస్టడీ సినిమాలో ఆ క్యారెక్టర్ లో దర్శనమివ్వనున్నాడు. ఈ మూవీలో పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నాగ చైతన్య కనిపించనున్నాడు.
‘కస్టడీ’ నుంచి ‘హెడ్ అప్ హై’ సాంగ్ :
కస్టడీ సినిమా (Custody Movie) నుంచి ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలు విడుదలయ్యాయి. వాటికి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ (Teaser) కూడా అందర్నీ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను చిత్ర యూనిట్ రిలీజ్(First Single Release) చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ మ్యూజికల్ ప్రమోషన్స్ ను ప్రారంభించింది.
‘హెడ్ అప్ హై’ అనే సాంగ్ ను కస్టడీ (Custody) సినిమా నుంచి చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ”సేఫ్టీ సెక్యూరిటీకి సింబల్ ఈ ఖాకీరా..మఫ్టీలో ఉన్నా కానీ పవరే పటాకీరా..డ్యూటీలో రౌండ్ ది క్లాక్ ఫుల్ టూ చలాకీరా” అంటూ ఈ పాట సాగుతుంది. తన బ్యాచ్ మేట్స్ తో కలిసి నాగ చైతన్య (Naga Chaitanya) హుషారుగా ఎంజాయ్ చేస్తూ ఆ పాడుకునే పాట ఇది. పోలీసుల స్పిరిట్ ను ఎనర్జిటిక్ గా ఈ పాటలో చిత్రీకరించారు.
పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ సాంగ్ (Song)ను రాశారు. యువన్ శంకర్ రాజా, అరుణ్ కౌండిన్య, అసల్ కోలార్ కలిసి ఈ పాటను పాడారు. ఈ సాంగ్ లో వెంకట్ ప్రభు తన మార్క్ ను చూపించారు. ఈ సినిమాలో నాగచైతన్య(Naga Chaitanya)ను కొత్తగా చూపిస్తున్నారు. నాగ చైతన్యకు జోడీగా ఇందులో కృతిశెట్టి నటిస్తోంది. విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. శరత్ కుమార్, ప్రియమణి, వెన్నెల కిషోర్ వంటివారు ఇందులో నటిస్తున్నారు. ఈ మూవీని మే 12న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.