»Salman Khans Kiseeka Bhai Kisiki Jaan Trailer Release
Salman Khan Movie : సల్మాన్ ఖాన్ ‘కిసీకా భాయ్ కిసీకి జాన్’ ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు సల్మాన్ ఖాన్ (Salman Khan) నటిస్తున్న సినిమా కిసికా భాయ్ కిసీకి జాన్ (Kisi Ka Bhai Kisi Ki Jaan) విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీని ఏప్రిల్ 21వ తేదిన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు సల్మాన్ ఖాన్ (Salman Khan) నటిస్తున్న సినిమా కిసికా భాయ్ కిసీకి జాన్ (Kisi Ka Bhai Kisi Ki Jaan) విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీని ఏప్రిల్ 21వ తేదిన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ మూవీలో సల్మాన్ కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్గా నటిస్తోంది.
‘కిసీకా భాయ్ కిసీకి జాన్’ ట్రైలర్ :
కిసికా భాయ్ కిసీకి జాన్ ( Kisi Ka Bhai Kisi Ki Jaan) సినిమాలో టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ (Venkatesh) కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయనకు జోడీగా భూమిక కనిపించనుంది. గతంలో ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన సాంగ్ లో వెంకటేష్, భూమికలు కనిపించారు. తాజాగా ఈ సినిమాలోని ఓ పాటలో రామ్ చరణ్(Ram charan) గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు.
సౌత్ మార్కెట్ని కూడా టార్గెట్ చేసి సల్మాన్ (Salman Khan) ఈ మూవీని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా అటు హిందీ, ఇటు తెలుగులో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి గ్లింప్స్, సాంగ్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో బతుకమ్మ (Bathukamma) సాంగ్ కూడా ఉండటంతో తెలుగు ప్రజలు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
తమిళంలో విడుదలై సక్సెస్ సాధించిన వీరమ్ సినిమాకు ఈ మూవీ రీమేక్ గా తెరకెక్కుతోంది. ఫుల్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ గా తెరకెక్కిన కిసీకా భాయ్ కిసీకి జాన్ (Kisi Ka Bhai Kisi Ki Jaan) సినిమా ట్రైలర్ (Trailer) అందర్నీ ఆకట్టుకుంటోంది. ఏప్రిల్ 21వ తేది ఈ మూవీ రంజాన్ కానుకగా విడుదల కానుంది.