Dhanush: గుండులో ధనుష్.. కొత్త లుక్ చూసి ఫ్యాన్స్ షాక్..!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రజినీకాంత్ అల్లుడి గా మాత్రమే కాదు, తన వర్సిటైల్ యాక్టింగ్ తో తెలుగు వారికీ పరిచయం అయ్యారు. ఇక్కడ కూడా అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన వరుసగా క్రేజీ సినిమాల్లో నటిస్తున్నారు. కొన్ని రోజులుగా పీరియాడిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ `కెప్టెన్ మిల్లర్` కోసం కష్టపడ్డారు.
`కెప్టెన్ మిల్లర్` సినిమా కోసం బారు గడ్డం, భారీగా జుట్టు పెంచి స్వామిజీలా మారిన ధనుష్ తాజాగా తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. తనయులతో కలిసి స్వామివారిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు. సోమవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన ధనుష్ స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అయితే, ఆ సమయంలో ఆయన గుండుతో కనిపించడం విశేషం.
మొన్నటి వరకు గుబురు గడ్డంతో ఉన్న ఆయన సడెన్ గా గుండుతో కనిపించడంతో అందరూ షాకౌతున్నారు. ప్రస్తుతం ఆయన గుండుతో ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆయన, మూవీ షూటింగ్ పూర్తి అవ్వడంతో తిరుమల దేవస్థానంలో తలనీలాలు సమర్పించడం విశేషం. ఈ లుక్ కూడా బాగుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఇక `కెప్టెన్ మిల్లర్` తరువాత ధనుష్ హిందీలో `తేరే ఇష్క్మే` పేరుతో రూపొందనున్న సినిమాలో నటించనున్నారు.