Prabhas : 'ఆదిపురుష్' సినిమా పై వివాదాలు కొత్తేం కాదు.రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో.. ఎప్పటికప్పుడు ఏదో ఓ వివాదం చుట్టుముడుతునే ఉంది. అసలు ఈ సినిమాను ఏ ముహూర్తన మొదలు పెట్టారో గానీ.. వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. టీజర్ రిలీజ్ అయిన తర్వాత చాలామంది మనోభావాలు తిబ్బతిన్నాయని కోర్టు మెట్లు కూడా ఎక్కారు.
‘ఆదిపురుష్’ సినిమా పై వివాదాలు కొత్తేం కాదు.రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో.. ఎప్పటికప్పుడు ఏదో ఓ వివాదం చుట్టుముడుతునే ఉంది. అసలు ఈ సినిమాను ఏ ముహూర్తన మొదలు పెట్టారో గానీ.. వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. టీజర్ రిలీజ్ అయిన తర్వాత చాలామంది మనోభావాలు తిబ్బతిన్నాయని కోర్టు మెట్లు కూడా ఎక్కారు. రాముడు ఇలానే ఉండాలి.. రావణాసురుడు అలా ఎలా ఉంటాడు.. అని చాలామంది విమర్శలు చేశారు. అప్పటి నుంచి ఆదిపురుష్ పై ఏదో ఓ వివాదం చుట్టుముడుతునే ఉంది. రీసెంట్గా శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌ను కూడా ట్రోల్ చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు కాపీ అనే కొత్త సమస్య తగులుకుంది. ప్రతీక్ సంఘర్ అనే ఓ కాన్సెప్ట్ ఆర్టిస్ట్ డిజైనర్.. ఆదిపురుష్ టీం తన డిజైన్స్‌ని, డ్రాయింగ్స్‌ని కాపీ కొట్టిందని ఆరోపించాడు. తను గీసిన కొన్ని రాముడి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘నా ఊహల్లో శ్రీరాముడిని కొత్తగా రూపొందించుకుని.. సరికొత్త రాముడి బొమ్మలు గీశాను.. ఏడాది క్రితమే ఈ బొమ్మలు గీశాను.. నా కళని ఆదిపురుష్ టీం కాపీ కొట్టిందని’ మండి పడ్డాడు. దీంతో మరోసారి ఆదిపురుష్ వివాదంలో నిలిచిందనే న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ఏడాది క్రితమే మనోడు ఆర్ట్ వేస్తే.. ఇప్పుడెందుక రియాక్ట్ అయ్యాడో.. అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే.. ఆదిపురుష్ పై ఇంత ప్రచారం జరుగుతున్నా.. ఆదిపురుష్ మేకర్స్ మాత్రం స్పందించడం లేదు. అసలు ఈ సినిమా అనుకున్న సమయానికే రిలీజ్ అవుతుందని.. క్లారిటీ చెప్పలేకపోతున్నాడు. మరి ఇప్పటికైనా ఓం రౌత్ స్పందిస్తాడేమో చూడాలి.