కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడిలేవు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వడివేలు తల్లి అనారోగ్యంతో మరణించింది. గత కొంత కాలంగా ఆమెకు వృద్ధాప్యపు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. తన తల్లి సరోజిని అమ్మాళ్ (ఎ) పాప (87) మరణించినట్లు వడివేలు మీడియాకు తెలిపారు. సరోజిని అమ్మాళ్ మధురై సమీపంలోని తన స్వగ్రామం విరగానూర్ లో ఉన్నారని, ఆమె గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు.
మధురైలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో ఆమె చికిత్స తీసుకుంటోందని, పరిస్థితి విషమించడంతో బుధవారం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్లు తెలిపారు. గురువారం సాయంత్రం సరోజినికి అంత్యక్రియలు నిర్వహించినట్లు కమెడియన్ వడివేలు తెలిపారు.