NTR : మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలయ్య, ప్రభాస్ అభిమానులు.. కొత్త సినిమాలతో పాటు రీ రిలీజ్ జోష్‌లో ఉన్నారు. తమ హీరోల హిట్ సినిమాలను మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై చూసి పండగ చేసుకుంటున్నారు. అంతేకాదు కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేస్తున్నారు.
మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలయ్య, ప్రభాస్ అభిమానులు.. కొత్త సినిమాలతో పాటు రీ రిలీజ్ జోష్‌లో ఉన్నారు. తమ హీరోల హిట్ సినిమాలను మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై చూసి పండగ చేసుకుంటున్నారు. అంతేకాదు కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా రీ రిలీజ్‌తో దుమ్ము దులిపేందుకు రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ‘అదుర్స్’ మూవీ ఎంతో స్పెషల్ అని చెప్పొచ్చు. ఇందులో తారక్ కామెడీ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంటుంది.. యంగ్ టైగర్ టైమింగ్ అదుర్స్ అనిపించింది. డ్యుయెల్ రోల్లో ఇరగదీశాడు ఎన్టీఆర్. మాస్ డైరెక్టర్ వివి.వినాయక్ తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ 2010లో రిలీజ్ అయింది. అందుకే 13 ఏళ్ల తర్వాత మరోసారి రీ రిలీజ్ చేసి.. అదుర్స్ కామెడీని ఎంజాయ్ చేయాలనుకున్నారు. ఇప్పటికే మార్చి 4న అదుర్స్ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రం రీ రిలీజ్ వాయిదా పడినట్టు తెలుస్తోంది. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఈ సినిమా రీ రిలీజ్ ఆగిపోయినట్టు టాక్. త్వరలోనే కొత్త రీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అయ్యారు. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న 30వ సినిమా నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. అందుకే ఈ ఏడాదిలో కనీసం ‘అదుర్స్’ చిత్రాన్నైనా థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేద్దామని అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేయడంతో నిరాశలో ఉన్నారు ఫ్యాన్స్. మరి అదుర్స్ మూవీని ఎప్పుడు రీ రిలీజ్ చేస్తారో చూడాలి.