»Action Reaction Is That The Reason For Chai And Sam Divorce
యాక్షన్, రియాక్షన్.. చై, సామ్ విడాకులకు కారణం అదేనా!?
ప్రస్తుతం నాగ చైతన్య, సమంత.. ఇండైరెక్ట్‌గా ఒకరి పై ఒకరు రియాక్ట్ అవుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు నాగచైతన్య, సమంత ఎందుకు విడిపోయారనేది? ఇప్పటికీ క్వశ్చన్ మార్కే. ఈ ఇద్దరు డివోర్స్ తీసుకున్న తర్వాత.. సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వచ్చాయి. కానీ తాజాగా నాగ చైతన్య, సమంత గురించి చేసిన కామెంట్ వైరల్‌గా మారాయి. సమంత చేసిన పోస్ట్ కూడా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
నాగచైతన్య(Naga chaitanya) నటించిన కస్టడీ సినిమా(Custody Movie) మే 12న థియేటర్లోకి రాబోతోంది. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా.. సమంత(Samantha) చాలా మంచిది, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పాడు చైతూ. ‘సామ్ లవ్లీ పర్సన్.. తను ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటాను. సోషల్ మీడియాలో వచ్చిన వదంతుల వల్ల మా ఇద్దరి మధ్య పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. ఒకరిపై ఒకరికి గౌరవం లేనట్లు జనాల్లోకి వెళ్లింది. అదే నన్ను బాధపెట్టిందని’.. అన్నాడు నాగచైతన్య. దీనిపై సమంత కూడా ఇండైరెక్ట్‌గా రియాక్ట్ అయింది. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ‘మనమంతా ఒక్కటే.. ఇగోలు, నమ్మకాలు, భయాలే మనల్నీ వేరు చేస్తాయి’ అంటూ పోస్ట్ పెట్టింది.
దీంతో చైతన్య(Naga chaitanya)కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చిందని అభిప్రాయపడుతున్నారు నెటిజన్స్. అయితే ఈ ఇద్దరి యాక్షన్, రియాక్షన్స్ చూస్తుంటే.. విడాకులు తీసుకోవడానికి ఇగోలే కారణమని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఇద్దరు బల్లగుద్ది మరీ చెప్పినట్టుంది. ఇద్దరి మధ్య మళ్లీ కలుసుకునేంత బాండింగ్ ఉన్నప్పటికీ.. కేవలం ఇగో వల్లే విడిపోయారని.. దానికి సోషల్ మీడియాలో జరిగిన ప్రచారమే.. కారణం అనేలా ఉంది వ్యవహారం. సినిమా ఇండస్ట్రీలో ఇగోలు కాస్త ఎక్కువే. అది కూడా ఇద్దరికీ స్టార్ డమ్ ఉంటే.. ఎవరు తగ్గరు. చైతన్య, సమంత(Samantha) ఇద్దరు స్టార్లే. అందుకే ఈ ఇద్దరు ఇగోలకు పోయినట్టు తెలుస్తోంది. ఎవ్వరు తగ్గకపోవడం ఒక కారణమైతే.. సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం రీజన్ అని చెప్పొచ్చు. దీని వల్లే డివోర్స్ తీసుకున్నారా? అనే డౌట్స్ వస్తున్నాయి. మరి మళ్లీ ఇద్దరు కలుస్తారేమో చూడాలి.