Pawan Kalyan: OG లీక్.. పవన్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్?
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ఓజి పై నెక్స్ట్ లెవల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పవన్ డై హార్డ్ ఫ్యాన్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ లీకేజి పవన్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న సినిమా దే కాల్ హిమ్ ఓజి. దీంతో ప్రస్తుతానికి టాలీవుడ్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే చెప్పొచ్చు. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్లో పవన్‌ను పవర్ ఫుల్ గ్యాంగ్ లీడర్‌గా చూపిస్తు సుజీత్ చేస్తున్న సినిమా దే కాల్ హిమ్ ఓజి. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చిన సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. లేటెస్ట్గా ఓజి స్టోరీ లీక్ అంటూ.. ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
ఈ సినిమా 1990 నాటి బ్యాగ్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ టైంలో ముంబైని గడగడలాడించిన మాఫియా డాన్‌గా పవన్ కనిపించనున్నాడట. అయితే కొన్ని కారణాలవల్ల పదేళ్ల పాటు మాఫియాకు దూరంగా ఉంటాడట పవన్. కానీ కొన్ని పరిస్థితులు ప్రతి కూలంగా మారడంతో.. మళ్లీ పదేళ్ల తర్వాత మాఫియాకు వ్యతిరేకంగా బరిలోకి దిగి.. శత్రువులను ఊచకోత కోస్తాడట. ఇదే ఓజి సినిమా మెయిన్ స్టోరీ అని నెట్టింట టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజం ఎంతుందో తెలియదు గానీ.. పవన్ చేసే ఊచకోతకు ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ అంటున్నారు.
పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ హంగ్రీ చీతా సెన్సేషన్ చేయడం పక్కా అంటున్నారు. సెప్టెంబర్ 27న ఓజిని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో.. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నాడు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఓజి ఊచకోత ఎలా ఉంటుందో చూడాలి.